అమరావతి నవంబర్ 2
ఏపీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌పై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇన్‌స్టెంట్ బీర్ తయారీ నిమిత్తం మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ.. దాఖలలైన అర్జీపై ఎక్సైజ్ శాఖ స్పందించలేదు. దీంతో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్‌ను మంగళవారం ధర్మాసనం ఎదుట హాజరుకావాలని అదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను ఆయన పట్టించుకోలేదు. దీంతో జస్టిస్ దేవానంద్ ధర్మాసనం ఈ మేరకు రజత్ భార్గవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కాగా పిటిషనర్ తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు