కామారెడ్డి సెప్టెంబర్ 21.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాలూకా లో పార్టీలకతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో 3.36 కోట్ల చేపపిల్లలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వంద శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందని సూచించారు. రైతు బీమా, పెట్టుబడి సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చేపలని విక్రయించడానికి వాహనాలను రాయితీపై ఇచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీ పై చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. మత్స్యకారులకు 24 రకాల పరికరాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మత్స్య పరిశ్రమ పారిశ్రామిక సంఘం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Home తెలంగాణ పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి