కోరుట్ల అక్టోబర్ 12
కోరుట్ల నియోజకవర్గంలో మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పడం తప్పితే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని, ఇది తెలియని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రహీమోద్దీన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా ఇటీవల మైనారిటీ సంక్షేమాన్ని కోరుతూ మాట్లాడగా దీనిని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మంగళవారం మెట్ పెల్లి
పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి పట్టణంలో సుమారుగా ఇరవై సంవత్సరాలుగా ముస్లిం మైనార్టీ ఎదురుచూస్తున్న షాది ఖానా ఏర్పాటు, ఖబ్రస్థాన్, ఉర్దూ మీడియం స్కూల్ ఏర్పాటు కలగానే మిగిలి ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తాము పార్టీలకు అతీతంగా మైనార్టీ సంక్షేమాన్ని కోరుతున్నామని, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నారు అన్నారు. మెట్ పల్లి పట్టణంలో షాదీఖానా నిర్మాణ పనులు ప్రారంభించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్పందించిన ప్రభుత్వం గత ఆరు నెలల క్రితం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ద్వారా భూమి పూజ చేశారని తెలిపారు. అయితే భూమి పూజ చేసి నెలలు గడుస్తున్నా నేటి వరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. టెండర్లను పిలిచినప్పటికీ వారి నిర్లక్ష్యం కారణంగా, వారి స్వలాభం కొరకు మధ్యనే టెండర్లను రద్దు చేశారని ఆరోపించారు. ఇలా చేస్తే మైనార్టీల సంక్షేమం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పనులు రేపోమాపో ప్రారంభమవుతాయని చెబుతున్న టిఆర్ఎస్ నాయకులు వారి ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి ఉంటే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పును పక్కనబెట్టి కాంగ్రెస్ నాయకుల పై దుష్ప్రచారం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని పిచ్చి ఆస్పత్రికి ఎవరికి పంపాలో మీ అజ్ఞానానికి వదిలేస్తున్నామని హితవు పలికారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ యూత్ నాయకులు మహమ్మద్ అజర్, మొహమ్మద్ మూసేబ్ మదర్ ఖాన్, మొహమ్మద్ ఫ్యాసల్, మహమ్మద్ షోహెబ్ మహమ్మద్ జుబేర్ ,మహమ్మద్ రిజవాన్, మహమ్మద్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.