మెదక్
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచిన ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హర్చరీస్ సంస్థ కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసారు. ఈనెల 16 తేదీన విచారణ వుంటుందని పేర్కోన్నారు. మాసాయిపేట మండలం అచం పేట హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ లొనే నోటీసులు జారీ చేసినా కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గినా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతొ 16 న పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది..