రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం నియోజకవర్గం 31వ వార్డులో ఇటీవల ప్రతిష్టించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి రామారావు గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి అపహరించుకుపోయారు. ఇది చిల్లర రాజకీయాలకు
తెరలేపడమేనని తెలుగుదేశం పార్టీ నేతలు అరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి అపహరించుకుపోయిన దుండగులను తక్షణమే పట్టుకుని చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు