Home ఆంధ్రప్రదేశ్ నుడా పార్కు పనులకు శంకుస్థాపన చేసిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్

నుడా పార్కు పనులకు శంకుస్థాపన చేసిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్

83
0

నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సూచనలమేరకు మంగళవారం  గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, పడారుపల్లిలో నుడా పార్కుకు నుడా ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాధ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నెల్లూరు గ్రామీణంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. గడిచిన 2 సంవత్సరాలలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, సంక్షేమ పధకాలు అన్నీకూడా అర్హులైన ప్రతిఒక్కరికి అందించడంలో స్థానిక శాసనసభ్యులు   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  దగ్గర నుంచి కార్యకర్త దాకా అర్హులైన వారందరికీ అందే విధంగా చూస్తున్నామన్నారు.
24వ డివిజన్ లో ఇప్పటికే 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో  నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు .ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇప్పటికే నెల్లూరు రూరల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో నుడా ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలసి తన వంతు సహకారం అందిస్తానని  నుడా ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాధ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నుడా వైస్ చైర్మన్ రమేష్, ఏఎంసి చైర్మెన్ యేసు నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు వర్సే శ్రీనివాసులు రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి, పామూరు మస్తాన్ రెడ్డి, యనమల మల్లికార్జున రెడ్డి, అన్నపరెడ్డి శేఖర్, సుధాకర్ రెడ్డి, శివయ్య, వి. మల్లి, సుబ్బా రావు, మురళి, వైసీపీ సీనియర్ నాయకులు హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleన‌రేంద్ర గిరి పార్దీవ‌దేహానికి రేపు పోస్టు మార్ట‌మ్ ఆనంద గిరిపై ఎఫ్ఐఆర్‌ నమోదు
Next articleసచివాలయాలను ఆకస్మికంగా తనిఖీచేసిన డిపిఓ ధనలక్ష్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here