జగిత్యాల నవంబర్ 23
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం అంగన్ వాడి కేంద్రాల్లో 0-5 పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం జరుగుతుందని జగిత్యాల ఐసిడిఎస్ సిడిపిఓ వీర లక్ష్మి అన్నారు. జగిత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని చింతకుంట వాడ
అంగన్వాడీ కేంద్రంలో లోప పోషక పిల్లలను గుర్తించి వారి తల్లులకు పోషక విలువలతో కూడిన ఆహారం ఇచ్చేందుకు గాను సిడిపిఓ వీర లక్ష్మీ అవగాహన సదస్సును నిర్వహించారు. లోప పోషణకు పిల్లకు అందించాల్సిన పోషక విలువలతో కూడిన
ఆహారాన్ని అందించాలని బాలింతలు, గర్భిణులు, తల్లులు ఏ ఎల్ యం సి తల్లుల కమిటీకి వివరించారు. ఇందులో భాగంగా అంగన్వాడి కేంద్రంలో మూడు సార్లు ఇంటి దగ్గర, మూడు సార్లు అదనంగా ఆహారం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
సిడిపిఓ వీర లక్ష్మి సూపర్వైజర్ స్వప్న అంగన్వాడి టీచర్ రమ, ఇంద్రజ, ఆశ వర్కర్ వనజ తదితరులు పాల్గొన్నారు.