నందికొట్కూరు. అక్టోబర్ 08
వాగులు, వంకలు, మురుగు నీటి కాలువలు ఆక్రమణ కు గురవుతున్నాయి.ఇవి చాలవు అన్నట్లు పూర్వీకుల సమాధులను సైతం భూ కబ్జా దారులు వదలడం లేదు.ఆక్రమణకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలసిన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ లోని పగిడ్యాల రహదారి లో తిక్కమ్మ సమాదినీ భూకబ్జా దారులు కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారు. గత 30ఏళ్ళ క్రితం తిక్కమ్మ అను మతిస్తిమితం లేని మహిళా బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది. పట్టణ ప్రజలు ఆమెను దైవంగా భావించే వారు. కాలక్రమేణా ఆమె మృతి చెందడం వలన దాతలు రెండు సెంట్ల స్థలం కేటాయించి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడే ఉన్న దేవతకు నీలి శికారిలు ప్రతి ఏడాది జాతర లాగా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు ఆ స్థలం కబ్జా కు గురైంది. ఎవరు అక్రమించారో కూడా అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.