Home ఆంధ్రప్రదేశ్ నా అనుభవంలో ఉన్న ఇంటిని ఆక్రమించి నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చట్ట రీత్యా...

నా అనుభవంలో ఉన్న ఇంటిని ఆక్రమించి నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి బాధితురాలు పడవల రామమ్మ అధికారులకు విజ్ఞప్తి

231
0

నెల్లూరు

మా చిన్న కుమారుడు రఘు, మా పెద్ద కోడలు ఆదిలక్ష్మి నా స్వాధీనం లో ఉన్న ఇంటిని ఆక్రమించిన మే కాకుండా, రౌడీల చేత నన్ను చంపించేందుకు ప్రయత్నిస్తున్న మా రక్తసంబంధీకుల పై విచారణ జరిపించి నాకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితురాలు పడవల రామమ్మ  జిల్లా అధికారులను వేడుకొన్నారు.  స్థానిక 2వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీర్ తోట, నివాసులు రామమ్మ జిల్లా అధికారులను వేడుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు, నా భర్త( శ్రీనివాసులు లేట్)కు 4గురు మగ పిల్లలు,1 కుమార్తె కలరు. వీరందరికీ వివాహం కూడా అయినది. నేను నా భర్త కష్టార్జితం లో భాగంగా ఒక ఇంటి నిర్మాణం తో పాటు, కొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొడుకుల జీవనం కోసం ఇంటిని అమ్మగా వచ్చిన నగదు నుండి  ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. కాలానుగుణంగా మగసంతానం లోని 2 వ,3 వ కుమారులు అనారోగ్య రీత్యా చనిపోయారని తెలిపారు. మొదటి కుమారుడికి మానసిక స్థితి బాగా లేనందున ఆయన భార్య అయిన ఆదిలక్ష్మి, అతనిని- మమ్మల్ని వదిలి గత 20 సంవత్సరాలుగా వేరే కాపురం ఉంటుందని చెప్పారు. తన భర్త అయిన శ్రీనివాసులు 2020 జనవరి 29న మరణించాడని పేర్కొన్నారు. ఆయన చనిపోవడంతో తాను నివాసం ఉంటున్న ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో మా పెద్ద కోడలు ఆదిలక్ష్మి, మా చిన్న కుమారుడు రఘు తో కలిసి నన్ను అంతమొందించి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునే క్రమంలో వారికి అనుకూలంగా ఉన్న రౌడీల చేత పంపించేందుకు ప్రయత్నం చేశారని  ఆరోపించారు. ఈ విషయమై  అనేకసార్లు 2వ నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం చేయకపోగా, నన్ను దుర్భాషలాడి, ఇక పోలీస్ స్టేషన్ వైపు వస్తే లోపల వేస్తామని బెదిరించారని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఈ విషయమై విచారించి, నా ఇంటి స్థలాన్ని, ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడమే కాకుండా, నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్న మా చిన్న కుమారుడు రఘు మరియు పెద్ద కోడలు ఆదిలక్ష్మి ల పై విచారణ జరిపి చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సమావేశంలో ఆమె కుమార్తె తోపాటు బంధుమిత్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Previous articleకారుణ్య నియామకం ద్వారా 44 మంది నూతన ఉద్యోగులు నియామక పత్రాలు అందించిన జిఎం శ్రీనివాస్
Next articleచంద్రబాబు నాయుడు పొరు దీక్షకు తెలంగాణ టిడిపి నేతలు సంఘీభావం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here