రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గేటు వద్ద డిసిఎం, ట్రాక్టర్ ఢీకొని ఒకరి దుర్మరణం చెందగా మరో ఆరు మంది త్రీవంగా గాయపడ్డారు. కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామం నుంచి ఉదయం రైతులు కూరగాయల విక్రయానికి హైదరాబాద్ నగరానికి డిసిఎం లో వెళుతుండగా ముచ్చర్ల గేటు వద్ద ఆగివున్న ట్రాక్టర్ ను డిసిఎం ఢీకొట్టింది. డిసిఎం డ్రైవర్ ఖాజామియా అక్కడిక్కడే మృతి చెందగా డిసిఎం లోఉన్న రైతులు పలువురు గాయపడ్డారు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రెవర్ ఖాజామియా (45)మృతదేహం క్యాబిన్లో ఇర్కోవడంతో పోలీసులు క్రేన్ సమయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.