Home ఆంధ్రప్రదేశ్ శంలోని వంద స్మార్ట్ సిటిల్లో… తిరుపతిని మొదటి స్థానంలో నిలుపుదాం ...

శంలోని వంద స్మార్ట్ సిటిల్లో… తిరుపతిని మొదటి స్థానంలో నిలుపుదాం * స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ నారమల్లి పద్మజ

88
0

తిరుపతి, అక్టోబర్ 20

అభివృద్దిలో తిరుపతి స్మార్ట్ సిటిని దేశంలోనే వంద స్మార్ట్ సిటీ ల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని  తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ నారమల్లి పద్మజ అన్నారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో  స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ గా నియమింపబడిన నారమల్లి పద్మజ బుధవారం అధికారికంగ భాద్యతలు చేపట్టడం జరిగింది. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి ఎం.పి.మద్దిల గురుమూర్తి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్,  ముద్రనారాయణల సమక్షంలో స్మార్ట్ సిటీ ఎం.డి,నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ఐఏఎస్ పర్యవేక్షణలో ఆమె అధికార భాద్యతలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నారమల్లి పద్మజ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను ప్రతిష్టాత్మక తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు మొదటి చైర్ పర్సన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంధ్రా రెడ్డికి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని వంద స్మార్ట్ సిటీల్లో తిరుపతి స్మార్ట్ సిటి చాలా విషయాల్లో ముందంజలో వున్నదనే విషయాన్ని ఆమె ప్రస్థావిస్తూ అందరి సహకారంతో మరింత అభివృద్ది సాదించేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తానన్నారు.

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ గా నియమింపబడిన నారమల్లి పద్మజ వైసిపి అధికార ప్రతినిధిగా సమర్ధవంతంగా పనిచేశారని గుర్తు చేస్తూ, ఆమె యొక్క సమర్ధ పనితీరుకు మంచి పలితమే స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ గా నియమించడం జరిగిందన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరం సమాలోచనలతో ముందుకు వేళతామన్నారు. తిరుపతి ఎం.పి.గురుమూర్తి మాట్లాడుతూ నారమల్లి పద్మజకు అభినందనలు తెలియజేస్తూ సమర్ధవంతమైన వ్యక్తికే మన స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ గ నియమింపబడడం జరిగిందని తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ వైసిపి పార్టిలో రాష్ట్ర అధికార ప్రతినిధిగ అందరికి సుపరిచితురాలైన నారమల్లి పద్మజ స్మార్ట్ సిటీ చైర్ పర్సన్ గా నియమించడం, పనిచేసే వారికి తగిన గుర్తింపు అన్నారు.

ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జి.ఎం. వి.ఆర్. చంద్రమౌళి, అదనపు కమిషనర్ హరిత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, వైసిపి నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి నాయుడు,  కార్పరేటర్లు, నగరంలోని ప్రముఖులు పాల్గొని నారమల్లి పద్మజకు అభినందనలు తెలియజేశారు.

Previous articleగ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు
Next article24 వ డివిజన్ ప్రచారంలో వైకాపా అభ్యర్థిని అరవ శాంతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here