మెదక్
భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఎన్నికల కోసం రైతు దీక్ష పేరిట రైతులను బీజేపీ మోసం చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1960. బి గ్రేడ్ ధాన్యం కు1940 రూపాయలు ధర నిర్ణయించిన మేరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే రైతుదీక్ష పేరిట డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినప్పటికీ ఆరు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి. పిఎసిఎస్ చైర్మన్ బాదెచంద్రం. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి. పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు. టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు ఐరేని పృథ్వీరాజ్ గౌడ్. కౌన్సిలర్లు దేమే యాదగిరి. బుర్ర అనిల్ కుమార్. టిఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్ రెడ్డి. పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు