Home తెలంగాణ ప్రతిపక్షాలవి ఉద్దెర మాటలు : స్పీకర్‌ పోచారం

ప్రతిపక్షాలవి ఉద్దెర మాటలు : స్పీకర్‌ పోచారం

260
0

హుజూరాబాద్‌ సెప్టెంబర్ 25
సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు.హూజూరాబాద్‌లోని జమ్మికుంటలో శనివారం జరిగిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హూజూరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆహ్వానం, మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. మిమ్ముల్ని బంధువుగా పలకరించి వెళ్తామని వచ్చానే తప్ప, స్పీకర్‌ హోదాలో కాదన్నారు. ఈ సమ్మేళనానికి 15 వేల మంది వరకు వస్తారని మంత్రి హరీశ్‌రావు చెప్పారని, ఇక్కడ చూస్తే అంతకు మించి వచ్చారని ప్రశంసించారు.సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. తెలంగాణ రాక ముందు నేను గ్రామాల్లోకి వెళ్తే రైతుల గురించి మాట్లాడాలంటే భయమేసేది. కరెంటు, నీళ్ల గురించి ఎక్కడ నిలదీస్తారేమోనని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో నేను వ్యవసాయ మంత్రి అయ్యాక… రైతులు తలెత్తుకునేలా పరిస్థితులు మారాయి. ఈ ఘనత కేసీఆర్‌దేనన్నారు.24 గంటలపాటు ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్‌ను ఇస్తున్నా రాష్ట్రం దేశంలో మనదేనని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టిన దేశాల గురించి ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే.. భారతదేశంలో తెలంగాణలోని 69.70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లు మాత్రమే గుర్తించారన్నారు. ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతుబీమా కింద గుంట స్థలం ఉన్నా రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నదని తెలిపారు. కొవిడ్‌ సమయంలోనూ రైతులు పండించిన ప్రతి గింజనూ మూడు సీజన్లలో కొని పది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కరోనా వల్ల డబ్బుల్లేవు, ఖజానా ఖాళీ అయింది. ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టి రూ.36 వేల కోట్లను బ్యాంకుల్లో రుణం తీసుకుని రైతాంగానికి ఇచ్చారన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రంలోని భూములను సాగుచేసేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు.బాన్సువాడలో సీఎం సహకారంతో గత నాలుగేండ్ల కాలంలో పేదలు, అన్ని వర్గాల వారికి ఐదువేల ఇండ్లు కట్టించానని, లబ్ధిదారులందరూ ఇండ్లలోకి వెళ్లారన్నారు. మరో ఐదువేల ఇండ్లు కావాలని సీఎంను అడుగగా ఆయన మంజూరు చేశారని, ప్రస్తుతం అవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. కొందరు మైక్ పట్టుకుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాజకీయం అంటే కోట్లాది మంది ఇచ్చిన పవిత్ర అస్త్రం. దీన్ని పవిత్రమైన మాటలతో, మంచి కార్యక్రమాలు చేపట్టాలి కానీ.. నువ్వేంత, నేనంత అనడం మంచిది కాదని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మేము పది ఇస్తే… మీరు 11 ఇచ్చి మాట్లాడండి. కల్యాణలక్ష్మి పథకం కింద మేము రూ.లక్ష ఇస్తే… మీరు రూ. రెండు లక్షలు ఇవ్వాలని, వారివి ఉద్దెర మాటలని, సీఎం కేసీఆర్‌వి ఉద్దెర మాటలు కాదు… అంతా నగదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అమాయకులు కాదని, న్యాయనిర్ణేతలన్నారు. 25 ఏండ్లుగా నా నియోజరవర్గ ప్రజలు ఆశీర్వదిస్తూ గెలిపిస్తున్నారు. పది మందికి న్యాయం చేస్తున్నాం కాబట్టేనని ఆయన పేర్కొన్నారు. ఓ పెద్ద మనిషిగా చెబుతున్నా…మీ జీవితంలో ఎక్కడా తలవంచుకోకుండా పేదలు సాయం కోరి వస్తే.. ఏ వర్గం, మతమని చూడకుండా మనస్ఫూర్తిగా సాయం చేయాలన్నారు.

Previous articleఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు
Next articleఈనెల 27 న భారత్ బందు ను విజయవంతం చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here