Home తెలంగాణ 175 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహాణ

175 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహాణ

299
0

రాజన్న సిరిసిల్ల

మైవేములవాడ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమము శుక్రవారం నాటికి 175 రోజులకు చేరుకుంది. దాతల సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. నేటి అన్నదాన కార్యక్రమం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు, పార్కింగ్ స్థలంలో, భీమేశ్వరాలయం ముందు ఉన్న యాచకులకు , అన్నర్థులకు మొత్తం 60 మందికి అన్నదానం చేయడం జరిగినదని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 175 రోజులుగానిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.  నిత్యాన్నదానం చేస్తున్న క్రమంలో నేటి అన్నదాతలుగా నగుబోతు రవీందర్, రొక్కం నర్సింహరెడ్డి, చీకోటి సమత-శ్రీధర్ వారి కుటుంబసభ్యులు అందించిన విరాళాలతో నేటి అన్నదానం నిర్వహించడం జరిగింది.
దాతలు చేస్తున్న సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం లక్ష్యంతో ముందుకు సాగడం జరుగుతుందని, అన్నదానం మహాదానం అని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్  ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్ , తాళ్లపెల్లి  ప్రశాంత్, జూలపెల్లి రాజు, డాక్టర్ బెజ్జంకి రవీందర్, భస్మాంగి బసవరాజు, కొప్పుల హనుమాండ్లు, ప్రతాప నటరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleట్రోలు,డీజిల్ ధరలు తగ్గించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి – జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
Next articleకళ్యాణ్ దేవ్, పులి వాసు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ‘సూపర్ మచ్చి’ టీజర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here