నెల్లూరు
అనాథలు దివ్యాంగుల ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రముఖ న్యాయవాది రమాదేవి అన్నారు . రెడ్ క్రాస్ లోగల వికలాంగుల శిక్షణ సంస్థలో బిస్కెట్ లు ఇతర తినుబండారాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . బాధిత చిన్నారులను ప్రేమతో ఆదరణతో చూడాలని, వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించేందుకు తల్లిదండ్రులు, సేవాసంస్థలు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు .అంగవైకల్యాని లెక్కపెట్టకుండా ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నత అధికారులు అయ్యారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భాను రామ్. సుప్రియ రెడ్ క్రాస్ సిబ్బంది సుమతి ఉమా స్వప్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు