Home ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళతో సమనమా మన ప్రజా ప్రతినిధులు… సిగ్గు సిగ్గు

దేవుళ్ళతో సమనమా మన ప్రజా ప్రతినిధులు… సిగ్గు సిగ్గు

132
0

అమరావతి
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ    చిలకలూరిపేట పట్టణంలోని పోలేరమ్మ గుడివద్ద దేవునితో సమానంగా అమ్మవారి రూపాల మధ్య స్థానిక ఎమ్మెల్యే విడుదల రజని ఇలా దణ్ణం పెడుతున్న ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టడం దేనికి సంకేతం, కావాలనే దేవతలను అవమానించటమే నని, మొన్న తిరుమలలో కొండ కింద నుంచి కొండ పై దాకా ముఖ్యమంత్రి ఫ్లేక్స్ లతో నింపేశారు. కేవలం 5ఏళ్ళు అధికారంలో ఉండే మన  ప్రజా ప్రతినిధులు సిగ్గు పడఁల్సిన విషయం. దేవుళ్ళతో పోటీ పడే స్థాయి కాదు మీది కాదు, ఇలా దేవుళ్లను అవమాణిస్తే అదే దేవుళ్ళు మీకు,మీ కురుంబాలకు సరైన సమయంలో తప్పక శిక్ష విధిస్తారని శ్రీధర్ హెచ్చరించారు. హిందు ధర్మాన్ని, సంస్కృతిని అవమణిస్తే  స్థానిక ప్రజలతో తగిన గుణపాటం చెప్తామని, భక్తులతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు దేవుళ్లను,మత విస్వాసలను దెబ్బతీసే విధానాన్ని శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధుల ఫ్లేక్స్ లు దేవాలయాల దగ్గర తొలగించకపోతే భక్తులతో భారీ ఉద్యమం చేపడతామని శ్రీధర్ హెచ్చరించారు

Previous articleడప్పు కళాకారులకు డ్రెస్ కోడ్ ల పంపిణీ
Next articleజిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here