జగిత్యాల, అక్టోబర్ 9
పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో నవ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం 3వ రోజు పద్మావతి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని సాయంత్రం వసంతోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రకాల పండ్లలతో ప్రత్యేకంగా అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి మహిళలు అధిక సంఖ్యలో ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు , భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ దుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.