తుగ్గలి
54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రమైన తుగ్గలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.గురువారం రోజున హైస్కూల్ నందు తుగ్గలి శాఖ గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.ఈ పోటీలలో హై స్కూల్, కస్తూరిబా పాఠశాల మరియు నోవి స్కూలు విద్యార్థిని విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు 20 తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్,కస్తూరిబా పాఠశాల,నోవి స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.