Home నగరం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జా’ మోషన్ పోస్టర్ విడుదల..

ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జా’ మోషన్ పోస్టర్ విడుదల..

130
0

ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా SSE ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై MTB నాగరాజు సమర్పణలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా కబ్జా. R చంద్రు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు ఉపేంద్ర. ఆయన లుక్ వైరల్ అయిపోయింది. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కబ్జా చిత్ర టీజర్ దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు:
ఉపేంద్ర, సుదీప్ తదితరులు

Previous articleసుప్రీమ్ హీరో సాయితేజ్ ‘రిప‌బ్లిక్‌’ సెన్సార్ పూర్తి… అక్టోబర్ 1న విడుదల
Next articleచీరంచు పై జగనన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here