నాగర్ కర్నూల్
రూ. 5,500 లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా మండల పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన సంకెళ్ల రాము తన తల్లి పేరు మీద ఉన్న ఇల్లును తన పేరు పై మార్చేందుకు రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.దీనికి పంచాయతీ కార్యదర్శి రామస్వామి రూ.5,500 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసిబి అధికారుల పథకంలో భాగంగా బాధితుడు రాము డబ్బులను కార్యదర్శి రామస్వామి క ఇస్తుండగా ఏసిబి డిఎస్పి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు రామస్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.