కడప, నవంబర్ 24
తోగూరిపేట వరద బాధితులకు ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ సాయం అందించారు. తన సొంత నిధులతో సమకూర్చిన వంట సామగ్రి, మినీ గ్యాస్ స్టవ్, బ్యాగు కిట్లను.. జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేడా.మల్లికార్జున రెడ్డిల చేతుల మీదుగా.. తోగూరిపేట చెయ్యేరు వరద బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి పద్మజ, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.