Home ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి న్యాయ సేవాకమిటి చైర్మన్ హిమబిందు

తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి న్యాయ సేవాకమిటి చైర్మన్ హిమబిందు

141
0

బెల్లంకొండ అక్టోబర్ 22
బెల్లంపల్లి మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో  మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ గొల్ల హిమబిందు అధ్యక్షతన
శుక్రవారం  పట్టణంలోని హనుమాన్ బస్తీలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు ను ప్రారంభించారు, ఈ సమావేశంలో మేజిస్ట్రేట్ హిమబిందు మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, అందులో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్టర్ 1987 ఉచిత న్యాయ సలహాలు , నేడు ఎక్కడ చూసినా యువత చేడు మార్గంలో నడుస్తూ, మొబైల్ వాడుతూ సామాజిక మాధ్యమాలతో పిల్లలు చెడు ప్రభావాలకు లోనవకుండా తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజు  కనిపెడుతూ బాధ్యతా యుతంగా పెంచాలి,వారితో బాధ్యత గా మెలగాలి,ముఖ్యంగా నేడు ప్రతిరోజు టివిలో  వచ్చే సీరియల్ వలన మహిళలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది,ప్రతి ఒక్కరు కుటుంబ విలువలు కాపాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడుతూ కుటుంబాలకు దగ్గరగా ఉండాలి, చిప్పమనోహర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు యువతకు బైకులు,మొబైల్ లు కొనిస్తున్నారు,ప్రతిరోజు బైకు లతో రోడ్లపై ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ప్రమాదాలకు గురిఅవుతున్నారు, వాహనాలకు సంబంధించిన పేపర్లు,  లైసెన్సులు, లేకుండా రోడ్లపై ప్రమాదాలు చేస్తూ ఎంతోమంది జీవితాలు అగమ్యగోచరంగా అవుతున్నాయి తల్లిదండ్రులు పిల్లలను దారిలోపెట్టె బాధ్యత వారిపైనే ఉంటుంది అని అన్నారు, ఆర్ధిక ఇబ్బందులతో చదువులేక  కాలి పేపర్లపై  సంతకం పెట్టడం వల్ల ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,  పోలీస్ కేసులు అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,  కేసులు కాకుండా ప్రతి పౌరుని యొక్క విధులు బాధ్యతలుపై వివరించారు. ఆన్లైన్ లో తెలిసితెలియక డబ్బులు నష్టపోతున్నారు వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు,ఈకార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గోపిక రాణి రచించిన సోషల్ లీగల్ డిమోషన్స్  అనే  పుస్తకము మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ గొల్ల హిమబిందు చేతుల మీదుగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ గొల్ల హిమబిందు న్యాయవాదులు న్యాయవాదులు గోపిక రాణి,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్ మనోహర్, న్యాయవాదులు  గోపి కిషన్ ఠాగూర్,ఎల్ రాము, అశోక్, శివకుమార్, రవికుమార్, రాజేష్, అనిల్ కుమార్, సాయి కుమార్ ,రాజేష్ ,రాజు ,హర్షవర్ధన్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు

Previous articleప్రారంభోత్సవానికి సిద్ధంగా సంక్షేమ వసతి గృహాలు
Next articleబిజెపి పట్టణశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి ఘన సన్మానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here