కరీంనగర్ నవంబర్ 8
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీ లోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో..ఖార్ఖాన గడ్డలోని ప్రభుత్వ వికలాంగుల..వృద్ధుల ఆశ్రమంలో పండ్లు.. బ్రెడ్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా..రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల్లో అన్నీ విధాల అండగా ఉండేట్లు తమ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డికి దేవుడు బలాన్ని ఇవ్వాలని.. ఆయుర్ ఆరోగ్యాలు అందించాలని.. 100 సంవత్సరాల దీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. లాంగ్ లీవ్.. లాంగ్ లీవ్ రేవంత్ రెడ్డి లాంగ్ లీవ్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సమద్ నవాబ్, ఉప్పరి రవి, యండి తాజ్, శ్రవణ్ నాయక్.. గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, కుర్ర పోచయ్య..మామిడి సత్యనారాయణ రెడ్డి, దండి రవీందర్, బాలబద్రి శంకర్, కొరివి అరుణ్ కుమార్, కొమ్ము సునీల్,ఎండి చాంద్..నిహాల్, జీడి రమేష్, మెరాజ్,యనమల మంజుల, ఎస్ డి అజ్మత్, యం.డి.సలీమొద్దిన్, రామిడి తిరుపతి, సాయిరి దేవన్న, ద్యావ శ్రీనివాస్ రెడ్డి,కాంపెళ్లి కీర్తి కుమార్, యం.డి నదీమ్ తదితరులు పాల్గొన్నారు.