పెద్దపల్లి అక్టోబర్ 07
పెద్దపల్లి నియోజకవర్గంలోని 144 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.43,85,000 చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బాలాజీ రావు, బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, రైతు సమితి అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఇతర గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.