బెల్లంపల్లి పట్టణంలో కాంటా నుండి బజార్ ఏరియాలో వ్యాపారులు వేస్తున్న చెత్త చెదారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపద్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తడి చెత్త & పొడి చెత్తపై వ్యాపారులకు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్. అవగాహన కల్పింశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత మాట్లాడుతూ పట్టణంలోని చిన్న,పెద్ద మధ్య తరహా వ్యాపారస్తులు,హోటల్ యజమానులు, చెత్త చెదారం రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త వాహనంలో మాత్రమే వేయాలని వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని స్వచ్ఛ బెల్లంపల్లి కి చేయడానికి సహకరించాలని అన్నారు,మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన వాహనాల్లో కాకుండా రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ లు గురుండ్ల లక్ష్మి, అస్మా షేక్ యూసఫ్ ,సముద్రాల లావణ్య గెల్లి రాజలింగు, రాము నాయక్, దామెర శ్రీను నాయకులు తడక రవి, ,మున్సిపల్ అధికారులు సిబ్బంది,మెప్మా సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.