Home ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

టీడీపీ నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరు

244
0

మంత్రాలయం

రాష్ట్రంలో టీడీపీ కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్ రెడ్డి  అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదనాలుగు  సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గా పని చేసిన వ్యక్తి నలబై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన సోంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పనులు చేపటకపోవడంతో ప్రజలు విసుగు చెందడంతో వైఎస్సార్సీపీని ఆదరించారన్నారు. అసెంబ్లీ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చంద్రబాబు నాయుడు, ఆయన ఎమ్మెల్యేలు బాబాయ్ గొడలి అని వ్యాఖ్యానించడంతో టీడీపీ హయాంలో జరిగిన హత్యల గురించి ప్రస్తావిస్తే టీడీపీ హయాంలో జరిగిన మాధవ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసుల గురించి కూడా మాట్లాడాలని మంత్రులు డిమాండ్ చేశారు. అక్కడ సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అసెంబ్లీ లో అడుగు పెట్టనని శబ్దం చేసి బయటకు వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. నిన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మీడియా ముందు మాట్లాడుతున్నారు కదా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని చెప్పుల దాడి చేసిన రోజే చంద్రబాబు నిజ స్వరూపం బయటపడిందని అంతే కాకుండా టీడీపీ హయాంలో మహిళల పై దాడులు జరిగినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది కదా అప్పుడు గుర్తు రాలేదా అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా ముందు దొంగ ఏడ్పు ఏడ్చిన చంద్రబాబు ఆయన హయాంలో మహిళ దినోత్సవం వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్. కే. రోజా గారి కన్నీటి కారణమయావని సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణా ను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని లాగినప్పుడు మహిళా ఆవేదన కన్పించలేదా అని ప్రశ్నించారు. . టీడీపీ నాయకులు  బీటీ నాయుడు తమ ప్రభుత్వం అధికారం వస్తే విజయవాడ సెంట్రల్ లో వైఎస్సార్సీపీ నాయకులను కాల్చి చంపుతా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి బెదిరింపులకు ఎవ్వరూ భయపడరని హెచ్చరించారు. స్వయానా అచ్చెం నాయుడే చెప్పారు. టీడీపీ పార్టీ లేదు తొక్కా లేదని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను మహా రాణులుగా తీర్చిదిద్దడమే కాకుండా చట్టసభలోను అవకాశం కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన చోటు చేసుకుంటే వెంటనే ఇలాంటి సంఘటనలు ఏపిలో జరగకుండా ఉండేందుకు దిశ చట్టం ప్రవేశపెట్టి, ప్రత్యేకంగా మహిళా పోలీసులు, పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. చివరగా చంద్రబాబు నాయుడుని కోరేది ఏమిటంటే ఏపీలో ప్రజలు నిన్ను నమ్మే స్థితిలో లేరు రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, నాయకులు మల్లికార్జున, జనార్దన్ రెడ్డి, శివ కుమార్, బద్రినాథ్, దామోదర్, ప్రహ్లద, వెంకటరెడ్డి, వీరారెడ్డి తదితరులు ఉన్నారు.

Previous articleకరాటే పోటీలలో ఖని విద్యార్థుల ప్రతిభ
Next articleన‌వంబ‌రు 23న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here