తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలో అక్రమంగా సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తుగ్గలి ఎస్సై షామీర్ భాషా తెలియజేశారు.సోమవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో ఐదు లీటర్ల సారాను, అదేవిధంగా పెండేకల్ ఆర్ ఎస్ గ్రామంలో పది లీటర్ల సారా ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా సారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలియజేశారు. అదేవిధంగా సారాను తరలిస్తూన ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు తుగ్గలి ఎస్సై షామీర్ భాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.