హైదరాబాద్ డిసెంబర్ 1
ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సమీక్ష సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్‌కు నివేదించామని ఆయన తెలిపారు.ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు