Home తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌

మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌

279
0

హైదరాబాద్ నవంబర్ 18 వెంకట్రామిరెడ్డి
రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజీనామాను ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్  హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా  పిటిషనర్లు పేర్కొన్నారు. అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామి‌రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Previous articleముఖ్యమంత్రి సంక్షేమ పథకాలే గెలిపించాయి. … శిల్పా కుటుంబాన్ని నమ్ముకుంటే పదవులు. … సొంత నిధులతో పేదలకు సేవలు. … జెడ్పీటీసీ గా గోపవరం గోకుల కృషారెడ్డి ఘనవిజయం
Next articleఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి: నటుడు శివాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here