న్యూఢిల్లీ అక్టోబర్ 20
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి చేరగా, డీజిల్ ధర రూ.94.92కు పెరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరిగి రూ.112.11కు, డీజిల్‌పై 37 పైసలు అధికమై రూ.102.89కు చేరాయి.ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో భాగ్యనగరంలో పెట్రోల్ ధర రూ.110.46కు, డీజిల్ ధర రూ.103.56కు చేరాయి. చెన్నైలో లీటరు పెట్రోలు రూ.103.31, డీజిల్ రూ.99.26, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.78, డీజిల్ రూ.98.03కు పెరిగాయి.తాజా పెంపుతో విమానాల్లో వినియోగించే జెట్ ఫ్యూయల్ ధరల కంటే పెట్రోల్ ధరలు 34 శాతం అధికమయ్యాయి. జెట్ ఫ్యూయల్ కిలో లీటర్‌కు రూ.79020.16 అంటే లీటర్‌కు రూ.79గా ఉన్నది.