కడప
మడమ తిప్పని నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా స్పష్టం చేశారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలు బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు తనకు అండగా నిలబడ్డారని ఆమె తెలిపారు. తన భర్త స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో అనారోగ్య కారణాలతో మృతిచెందడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తన కుటుంబానికి అండగా నిలబడ్డారని ఆమె చెప్పారు మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ముఖ్యమైన వైకాపా నాయకులు తన ను ప్రోత్సహించి అండగా ఉండడంతో బద్వేల్ అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు డాక్టర్ సుధా తెలిపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమన్నారు బద్వేలు వర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు బద్వేల్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేసేందుకు పుష్కలంగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు అలాగే నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల విషయము లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని ఆమె తెలిపారు ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు తన గెలిపిస్తే చేయవలసిన అభివృద్ధి పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తానని ఆమె తెలిపారు తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించాలని డాక్టర్ సుధా కోరారు విలేకర్ల సమావేశంలో ఆడ చైర్మన్ సింగసాని గురు మోహన్ బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వీ రాజగోపాల్ రెడ్డి సివిల్ సప్లై డైరెక్టర్ సుందర రామిరెడ్డి సగర సంఘం చైర్మన్ రమణమ్మ వైకాపా నాయకులు నోబుల్ శంకర్ రెడ్డి పుత్త శ్రీ రాములు తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు