గోనెగండ్ల
గోనెగండ్ల మండలంలోని పిల్లగుండ్ల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు 8 అక్టోబర్ శుక్రవారం రోజు జయపాల్, బుగ్గన్న, వెంకటేశ్వర్లు, sc మాదన్న, రవి కుమార్, బోయ గోవింద్, పరమేష్, ఉసేని, సుంకన్న మరియు వారి అనుచరులు సుమారు 100 మంది పిల్లగుండ్ల గ్రామ టిడిపి పార్టీ నాయకులు రాముడు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరినారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి గారు వీరికి టిడిపి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీలోకి చేరిన పిల్లగుండ్ల గ్రామ నాయకులు మాట్లాడుతూ అధికార వైసిపి పార్టీ అధినేత, స్థానిక ఎమ్మిగనూరు శాసన సభ్యులు అధికారం లోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఎక్కడ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. వైసిపి నాయకులు మోనార్క్ నిర్ణయాల వల్ల, అరాచక పాలన వల్ల కింది స్థాయి కార్యకర్త నుండి బడా బడా నాయకుల వరకు వైసిపి పార్టీలో అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలలో టిడిపి పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఆకర్షితులై అభివృద్ధి జరగాలి అంటే ఒక్క టిడిపి పార్టీతోనే సాధ్యమని తెలుసుకొని టిడిపి పార్టీలోకి చేరుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.