నెల్లూరు
గాంధీ జయంతి సందర్భముగా సెట్నెల్, జిఓ ఎన్జీఓ, ది పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుజబుజనెల్లూరు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మొక్కలు నాటడం మరియు ఇంటింటికీ మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిఓ ఎన్జీఓ నోడల్ అధికారి డా.ఎ మహేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ మొక్క, ఊరంతా వనం కావాలని ,ఈ నెలంతా పీఎంపీల సహకారంతో గ్రామాల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భూమిపై ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితం కోసం చెట్లు ఎంతో అవసరమని అన్నారు. వివిధ అంశాలలో మనుషుల జీవితం, జంతువుల జీవితం చెట్లపై ఆధారపడి ఉంటుందన్నారు. నేటి మొక్కలు రేపటి చెట్లు,వృక్షాలని. మొక్కలు నాటడం చాలా సులభమని, దానికి నీరుపోసి,పెంచి పోషించడమే లక్ష్యంగా పెట్టుకొని మొక్కలు పెంచి, ఊరంతా వనం చేసినప్పుడే వాతావరణ సమతుల్యత చేకూరి అందరూ ఆరోగ్యంగా జీవించగలరని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమములో రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్, పిహెచ్ సి కోఆర్డినేటర్ కె.వెంకటేశ్వర్లు, జిల్లా పీఎంపీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, జి.శేషయ్య, డి. శ్రీనివాసులు,షేక్ నాయబ్ రసూల్, గ్రామస్థులు దూడల ప్రసాద్ రావు, బద్దెపూడి నరసింహులు, నారాయణ, సుబాన్, మధు, శ్రీధర్, సెట్నెల్ సూపర్నెంట్ గాయజ్ అహ్మద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.