జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అసిఫాబాద్ సెప్టెంబర్15
మొక్కలు నాటడం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాది కా అమృత మహోత్సవం “స్వచ్ఛత హే సేవ” ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని అన్నారు. ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటుతున్న మొక్కలు రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. దీని వల్ల పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల ప్రత్యేక కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రవికృష్ణ, జడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, డిఐఈఓ శ్రీధర్ సుమన్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.