Home ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారు మీడియా సమావేశంలో చంద్రబాబు

ప్రజలతో ఆడుకుంటున్నారు మీడియా సమావేశంలో చంద్రబాబు

243
0

తిరుపతి
భారీ వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. భారీ వర్షాలు పడుతాయని తెలిసినా ప్రజలతో ఆడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు. లక్ష్మీపురం సర్కిల్ లో వరదనీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేదు. భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య అనారోగ్యానికి గురైంది. కడపజిల్లాలో ఆరుగ్రామాలు ఇప్పటికీ వరనీటిలోనే ఉంది. రాయలచెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. ప్రకృతితో ఆడుకున్నారు. తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరదనీటిని శుభ్రం చేశారు. వరద బాధితుల ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్ కు ఆనందం. మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాలి. తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలి. తప్పిదానికి కారణమైన వారిని శిక్షించాలి. వరద బాధితులను చూసి ఆవేదన చెందాను. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40వేల మందిని ఆదుకున్నాం. నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పించాం. పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. కపిలతీర్థం నుంచి కొండపక్కనే కాలువ తీయాలి. కపిలతీర్థం నీరు స్వర్ణముఖినదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Previous articleనాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి
Next articleజవాద్ తుఫాన్ తో బోసి పోయిన శ్రీకాళహస్తిశ్వరాలయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here