డోన్
డోన్ పాతపేట లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పి యం సి
ఎన్నికల అధికారిగా వెంకట సుబ్బారెడ్డి వ్యవహరించారు,ఎన్నికలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ తెలిపారు. ప్రతి తరగతి నుండి ముగ్గురు కమిటీ సభ్యుల చొప్పున 5 తరగతులకు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకొని, వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించడమైనది. ఆతర్వాత అందరి సమక్షంలో చైర్మన్ గా జయకర్, వైస్ చైర్మన్ గా పద్మావతి ని ఎన్నుకొనడం జరిగింది.వారితో పాటు కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.పాఠశాలకు అన్ని రకాలుగా సహకారం అందించి, పురోభివృద్ధి లో పాలుపంచుకుంటామని మాట్లాడారు.ఈ సందర్భంగా పాతకమిటీ చైర్మన్ షేక్షావలికి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు..అలాగే కొత్త కమిటీ చైర్మన్ జయకర్, వైస్ చైర్మన్ పద్మావతి గార్లకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈకార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, వెంకట రమణ,రవీశేఖర్, చంద్రశేఖర్ గౌడ్, వెంకట లక్ష్మీ, రాధ, లక్ష్మయ్య, లక్ష్మి కాంతరెడ్డి,అనంత శ్రీనివాసులు, శ్రీనివాసులు,భూకాంతరెడ్డి, మద్దిలేటి, సుబ్బారాయుడు,జయ సుబ్బారాయుడు, మధుసూదన్ రెడ్డి,సుభాన్ భాష, రాఘవేంద్ర, శ్రీనివాసులు, శివన్న, ఆదినారాయణ, సురేష్, లీలావతమ్మ, నూర్జహాన్, శ్రీ కళ, సంజీవరెడ్డి, రమేష్, శ్రీనివాసులు, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి, మారుతి, లక్ష్మి ప్రభావతి,మునిరాజు, ప్రసాద్ రావు,సిఆర్పి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.