Home ఆంధ్రప్రదేశ్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా పోక‌ల అశోక్‌కుమార్‌, కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా పోక‌ల అశోక్‌కుమార్‌, కె.సంజీవ‌య్య‌ ప్రమాణస్వీకారం

140
0

తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 23,
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా  పోక‌ల అశోక్‌కుమార్‌,  కె.సంజీవ‌య్య గురువారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి  నారాయ‌ణ‌స్వామి ఈ ఇరువురు బోర్డు స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు, సుధారాణి,  లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి
ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Previous articleగొప్ప మనసును చాటుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గణేష్ నిమజ్జనం గొడవ లో మృతి చెందిన గిరిజన యువకుడు కుటుంబానికి రెండు లక్షల నగదు అందజేత పార్టీలకతీతంగా ప్రజలకు అండగా నిలబడే నేతగా ఎమ్మెల్యే ఆళ్ల పై ప్రజల ప్రశంసల జల్లులు
Next articleఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి కమిషనర్ గిరీషా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here