హైదరాబాద్ అక్టోబర్ 22
అంబర్‌పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరుడైన హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు.2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్ఐ సిద్ధయ్య, ఇద్దరు కానిస్టేబుల్స్ సహా హోంగార్డు లింగయ్య ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగం స్ఫూర్తిదాయకమని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.