Home తెలంగాణ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాని బండి సంజయ్‌పై పోలీసులు కేసు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాని బండి సంజయ్‌పై పోలీసులు కేసు

120
0

నల్లగొండ నవంబర్ 16
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా పర్యటన జరిగిన నేపథ్యంలో బండి సంజయ్‌, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. సోమవారం బండి సంజయ్‌కుమార్‌ నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నేతలపై కేసు నమోదు చేశామన్నారు.బండి సంజయ్‌ పర్యటనను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాఠీచార్జి చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సభలు, సమావేశాలను అనుమతి లేదన్నారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్‌ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం, పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత చివరి నిమిషంలో అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతిచోట ఉద్రిక్తత చోటు చేసుకున్నదన్నారు.ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని రంగనాథ్‌ వివరించారు. మిర్యాలగూడ సబ్‌ డివిజన్‌ పరిధిలో పర్యటనను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో చోటు చేసుకున్న ఘటనలో పలువురు పోలీస్‌ సిబ్బందికి సైతం గాయాలయ్యాయన్నారు.

Previous articleహైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ మొక్కలు నాటిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ
Next articleకుప్పంలో పార్టీ విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here