నంద్యాల
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు బంద్ చేయాలని బయలుదేరితే పోలీసులు గృహ నిర్బంధం చేశారని భూమ బ్రహ్మానందరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యాలయం పై మరియు పార్టీ నాయకుల ఇళ్ల పై వైసీపీ నేతలు దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు బుధవారం నాడు నంద్యాల యందు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ భూమ బ్రహ్మానందరెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు. కాని పోలీసులు భూమ బ్రహ్మానందరెడ్డి ని ఇంటి లోనే గృహ నిర్బంధం చేశారని తెలిపారు. అలాగే మా కౌన్సిలర్లను . కార్యకర్తలను ఎక్కడి కక్కడనే అరెస్టు చేశారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రౌడీ రాజ్యమా అని దుయ్యబట్టారు. ప్రతి పక్ష పార్టీ నాయకులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ప్రజా స్వామ్య వ్యవస్థ కు పెను ప్రమాదం అన్నారు . ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఇంటి మీదకు వచ్చి దాడులు చేస్తారని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు