గిద్దలూరు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. గిద్దలూరు పట్టణంలోని ఎల్ఐసి కాలనీలో నివాసముంటున్న శ్రీధర్,అతని భార్య తిరుపతమ్మ ను దారుణంగా రొట్టెల పెనంతో దాడి చేసి చంపాడు. ఎస్సై బ్రహ్మనాయుడు, సీఐ ఫిరోజ్, డిఎస్పి కిషోర్ కుమార్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు.. శ్రీధర్ తిరుపతమ్మకు 9 సంవత్సరాల క్రితం వివాహం అయిందని. వ్యభిచారం వృత్తిగా చేసుకొని తిరుపతమ్మ జీవనం సాగిస్తున్న క్రమంలో లారీ క్లీనర్ గా పని చేస్తున్న శ్రీధర్ కు పరిచయం ఏర్పడి వీరు వివాహం చేసుకున్నారని తెలిపారు. వీరు కంభం, బెస్తవారిపేట, గిద్దలూరులో పని చేసుకుంటూ జీవనం తిరుపతమ్మ క్యారెక్టర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీధర్ కు తిరుపతమ్మకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని ఆ క్రమంలో సోమవారం ఇద్దరు మరోసారి గొడవపడి ఇంటిలో ఉన్న రొట్టెల పెన్నంతో ఆమె తలపై బలంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు.స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజానిజాలు బయటికి వచ్చాయని నిందితుడిని కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.