జగిత్యాల అక్టోబర్ 12
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా జగిత్యాల కు చెందిన పొన్నం లావణ్య గౌడ్ ను నియమించినట్లు డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్, రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్క గంగారెడ్డి లు మంగళవారం ప్రకటించారు. లావణ్య గౌడ్ గత ఆరు ఏండ్ల నుండి పలు దినపత్రికల్లో, పలు టివి ఛానళ్లలో విలేఖరిగా, ఆంకర్ గా, న్యూస్ రీడర్ గా చేసిన పని తనాన్ని గుర్తించారు. ఉన్నత చదువులు చదివిన విద్యా వంతురాలిగా గుర్తించి, సేవాభావం, పోరాట తత్వం కలిగి ఉన్నదని గ్రహించి ఈ నియామకం చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు.లావణ్య గౌడ్ నియామకం పట్ల రాష్ట్ర కార్యవర్గం, వివిధ జిల్లా కమిటీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు