Home ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో వెంకటగిరిలో జనాగ్రహ దీక్ష

ఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో వెంకటగిరిలో జనాగ్రహ దీక్ష

125
0

నెల్లూరు
నెల్లూరు జిల్లా వెంకటగిరి లో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సారధ్యంలో జనాగ్రహ దీక్ష గర్జించింది .ఆనం రామనారాయణ రెడ్డి సారధ్యంలో భారీ ర్యాలీ గా ప్రారంభమై ,జనాగ్రహ దీక్షా శిబిరానికి వైకాపా శ్రేణులు చేరుకున్నాయి. శుక్రవారం వెంకటగిరి టౌన్ త్రిభువని సెంటర్ లో ప్రజానేత స్వర్గీయ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి గజ మాలతో నివాళి అనంతరం–భారీగా హాజరైన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాదయాత్ర ర్యాలీగా,స్థానిక  ఎం ఆర్ వో కార్యాలయం సెంటర్ వరకు అభిమానులతో కలిసి జనాగ్రహ దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే ఆనం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి , శాసనసభ్యులు సాయి కృష్ణ యాచేంద్ర , వెంకటగిరి మునిసిపాలిటీ,వెంకటగిరిరూరల్, బాలాయపల్లి, డక్కిలి,సైదాపురం,రాపూరు మరియు కలువాయ. మండలాల పరిధిలోని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, పార్టీ బాధ్యులు,వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్స్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసిలు,ఎంపీటీసీలు,సర్పంచులు,వార్డు సభ్యులు,వ్యవసాయ,సహకార మండలి సభ్యులు,పలువురు అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Previous articleకనకదుర్గమ్మ వారధిపై రోడ్డు ప్రమాదం
Next articleఎట్టకేలకు బోడుప్పల్ మునిసిపల్ సూరజ్ నగర్ లో ప్రారంభమైన డ్రైనేజీ పనులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here