Home తెలంగాణ న‌రేంద్ర గిరి పార్దీవ‌దేహానికి రేపు పోస్టు మార్ట‌మ్ ...

న‌రేంద్ర గిరి పార్దీవ‌దేహానికి రేపు పోస్టు మార్ట‌మ్ ఆనంద గిరిపై ఎఫ్ఐఆర్‌ నమోదు

301
0

అలహాబాద్ సెప్టెంబర్ 21
అనుమానాస్పద స్థితిలో మరణించిన అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు న‌రేంద్ర గిరి పార్దీవ‌దేహానికి బుధవారం పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం ఆయ‌న పార్దీవ‌దేహాన్ని బాఘంబ‌రీ మ‌ఠంలో ఉంచ‌నున్నారు. ఇవాళ ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మ‌ఠం వ‌ద్ద న‌రేంద్ర గిరి పార్దీవ‌దేహానికి నివాళి అర్పించారు. దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని సీఎం అన్నారు. అనేక ఆధారాల‌ను పోలీసులు సేక‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని ఏడీజీ జోన్‌, ఐజీ రేంజ్‌, డీఐజీ పోలీసులు అధికారులు ఈ కేసును విచారిస్తున్న‌ట్లు సీఎం యోగి తెలిపారు.
ఆనంద గిరిపై ఎఫ్ఐఆర్‌..
న‌రేంద్ర గిరి బ‌ల‌వ‌న్మార‌నానికి పాల్ప‌డిన ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను కనుగొన్నారు. తన శిష్యుడైన ఆనంద్‌ గిరి తనను మానసికంగా వేధించాడని ఆ నోట్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, ఆనంద గిరితో పాటు సూసైడ్‌ నోట్‌లో పేర్లు ఉన్న వ్యక్తులు ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్‌ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న‌రేంద్ర గిరి వ‌ద్ద శిష్య‌రికంలో ఉన్న విద్యార్థులు ఆయ‌న మృత‌దేహాన్ని క‌నుగొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆనంద్‌ గిరి ఖండించారు. ‘ఇది ఏడాదికి పైగా జరుగుతున్న కుట్ర. మొదట గురూజీని నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు ఆయనను హత్య చేశారు. ఈ కుట్రలో పోలీసులు, ల్యాండ్‌ మాఫియా పాత్ర ఉంది’ అని ఆనంద్ గిరి ఆరోపించారు. మఠం భూమి అమ్మకంపై గతంలో తనకు, గురూజీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, మేలో అవి పరిష్కారమయ్యాయని చెప్పారు. అఖాడా పరిషత్‌ దేశంలో అతిపెద్ద సాధువుల సంస్థ.మహంత్‌ నరేంద్ర గిరి (72) అనుమానాస్పద స్థితిలో మరణించిన విష‌యం తెలిసిందే. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్టున్న స్థితిలో ఆ సాధువు మృతదేహాన్ని సోమవారం గుర్తించారు

Previous articleఓ పిట్ట కథ’ మూవీ ఫేమ్ సంజయ్ రావు హీరోగా ‘ప్రేమిస్తే ఇంతే’ చిత్రం ప్రారంభం
Next articleనుడా పార్కు పనులకు శంకుస్థాపన చేసిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here