నల్లగొండ నవంబర్ 15
: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి పేర్కొన్నారు. బండి సంజయ్ వంద కార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడులు చేస్తున్నారు.గత ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయి అని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చు పెడుతుండు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ కేంద్రంతో చెప్పించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు నిలదీస్తే బండి సంజయ్ గుండాలు దాడి చేయించాడు అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.