కౌతాళం
;మండల కేంద్రంలో అకాల వర్షానికి పలు కాలనిల్లో పరిశుభ్రత లోపించి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్పంచ్ పాల్ దినకర్ తెలియజేశారు. కాలనీలలో పరిశుభ్రత నెలకొందని వాటిని శుభ్రపరచి అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్మికులు బ్లీచింగ్ పౌడర్ వెదజల్లారు కృష్ణ ఆశ్రమం నుంచి బాపు రోడ్డు వరకు ఇరువైపుల ఉన్న దిబ్బలను తొలగించి దోమలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ ను వెదజల్లారు. సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జ్వరాలు తుమ్ములు దగ్గు అనుమానం వచ్చినచో ఆస్పత్రిలో చికిత్స పొందవలెనని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్ ఉపసర్పంచ్ తిక్కయ్య, మహానంది మరియు ఆశ వర్కర్లు ఉన్నారు.