తుగ్గలి
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ద వహించాలని తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక వైద్యశాలలో నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలను
నిర్వహించారు.వైద్య పరీక్షల అనంతరం గర్భిణీలకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ మాతా,శిశు మరణాల సంఖ్యను
గణనీయంగా తగ్గించడానికి ప్రతినెల కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలియజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో గర్భిణీలకు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి,వారికి మెరుగైన ఆరోగ్యం కొరకు మందులను కూడా అందజేస్తామని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ పై బాలింతలకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ను వేయించుకొని తల్లి పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి ప్రాథమిక వైద్యశాల సిబ్బంది,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు నాగమణి, షకీనా గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.