కౌతాళం
అకాల వర్షంతో నట్టేట మునిగిన రైతన్నలు కొంప ముంచుతున్న తుఫాన్ అకాల వర్షంతో రైతులు విలవిల్లాడుతున్నారు. వరి పంట పొలాలు మునిగిపోయి మరియు వరి కుప్పలు, మిరప కుప్పలు నీటమునిగాయి. పత్తి చేలలో పత్తి నాని పోయి రైతులకు ఆర్థిక నష్టం కలిగించింది. ఈ ఆకల వర్షానికి రైతులు చాలా ఆర్ధిక నష్టం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టం గుర్తించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు చేరవేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వర్షాలు పడటం తో ఉన్న పంటలు కూడ లద్దే పురుగులు, దోమ పడి సర్వనాశనం అవుతాయని పత్తి నాని నాసిరకంగా మారడంతో అధిక నాణ్యత కోల్పోయి రాబడి తగ్గుతుందని తమ బాధను వెళ్ల బుచ్చారు అధికారులు స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.