Home ఆంధ్రప్రదేశ్ భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట -హోమాలు పూజలు నిర్వహించిన...

భక్తి శ్రద్ధలతో శ్రీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట -హోమాలు పూజలు నిర్వహించిన వేదపండితులు – శ్రీ సాయి సత్సంగ నిలయంలో అన్నదానం, ప్రత్యేక పూజలు

104
0

నెల్లూరు

నెల్లూరు జిల్లా ,గూడూరు పట్టణం, పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలోని దుర్గాదేవి ఉప పీఠం నందు హిందూ ధర్మ పరిరక్షణ జిల్లా కో ఆర్డినేటర్, సమరసత రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోటా సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రయోక్తంగా శ్రీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారి కాకడ హారతి, నిత్య పూజ, నిత్య రుద్రాభిషేకం, నిత్య నవావరణ హోమమం నిర్వహించారు. వేద పారాయణం, ఆవాహిత దేవతా పూజ, అధివాసాంగ హోమములు, మూల మంత్ర హోమాలు, యోగిని, వాస్తు, క్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర మండల హోమాలు,  శ్రీ విజయ దుర్గా అమ్మవారి మరియు గురుదేవులు వారి సంపూర్ణ అనుగ్రహంతో  ,శ్రీ లక్ష్మీ గణపతి,  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ భవాని శంకర స్వామి, శ్రీ సూర్య నారాయణ స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా వార్ల యంత్ర స్థాపన, తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ భవాని శంకర స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా వార్ల విగ్రహ ప్రతిష్ట విశేషరీతిలో జరిపారు.తదుపరి అష్ట బంధనం, మూర్తి హోమం, జీవన్యాసం, కళాన్యాసం,నాడీఅనుసంధానం,స్పర్శాహుతి, ప్రాణ ప్రతిష్ట, ఆజ్య పూర్ణాహుతి, కుంభాభిషేకం, విశేష అలంకరణ, దర్పణ, గో, బాల, కన్య, దంపతి, అన్నకూట, సర్వ దర్శనం, విశేష అర్చన, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పములు విశేష రీతిలో అనంతరం శివపార్వతుల కళ్యాణం మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం విశేషరీతిలో జరిగింది.ఈ పూజా కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ  శ్రీశైల మల్లికార్జున దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ నెంబర్  గిరీష్ రెడ్డి కోటా ప్రకాశం స్వామి దంపతులు, కోటా సునీల్ కుమార్ స్వామి దంపతులు, వేదపండితులు, భక్తులు  తదితరులుపాల్గొన్నారు.

Previous articleబ్యాంకర్లు తమ లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించిన కలెక్టర్
Next articleహుజురాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక లక్ష 50 వేల మందికి 3 గంటల్లో 90 కోట్ల రూపాయలను పంపిణీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here