కడప అక్టోబర్ 04
కడపజిల్ల లో ఉత్తమ బోధనతో మంచి పేరు ప్రతిష్టలు సిద్ధిస్తాయని కృష్ణ బలిజ పూసల సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమారి వైకాపా బీసీ రాష్ట్ర నాయకులు పసుపులేటి మనోజ్ కుమార్ లు పేర్కొన్నారు స్థానిక నెహ్రూ పార్క్ ఎదురుగా స్వప్న మోహన్, సునీల్ కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ను వారు ప్రారంభించి మాట్లాడుతూ అన్ని రకాల పోటీ పరీక్షలకు కడపలో విద్యార్థులు కు శిక్షణా సంస్థ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ లు స్వప్న మోహన్ ,సునీల్ కుమార్ లు మాట్లాడుతూ అన్ని రకాల పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో బెంగేళూరు నగరంలో అనుభవం ఉందని కడప జిల్లా విద్యార్థుల కోసం అన్ని రకాల పోటీ పరీక్షలను విజయవంతంగా పాస్ అవ్వడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశామని వారు తెలిపారు మంచి నైపుణ్యం గల అధ్యాపకులచే ఐఐటీ,జె ఇ ఇ నీట్, ఐఐటీ ఫౌండేషన్ ప్లేస్మెంట్, ఓరియెంటెడ్ కోర్సులు బ్యాంకు ఎగ్జామ్ కోచింగ్ ,కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రాం, కిడ్స్ కోడింగ్ వంటి వాటికి ఉత్తమ శిక్షణ అందించ బడును ఆని తెలిపారు కడప జిల్లా విద్యార్థుల కు ఘ మంచి భవిష్యత్తు నివ్వాలని ఉద్దేశంతో కడపలో సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.